Tuesday, November 26, 2024

క్లాస్‌ ఆఫ్‌ ఒన్‌, రిజిస్టేషన్లకు నవంబర్‌ 25 చివరి తేదీ

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : భారతదేశంలో సుప్రసిద్ధ ఆన్‌లైన్‌ పాఠశాల, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ “ద క్లాస్‌ ఆఫ్‌ ఒన్‌” (టీ-సీఓ1) వరుసగా పలు జాతీయ స్ధాయి పోటీలను “హైదరాబాద్స్‌ గాట్‌ టాలెంట్‌” శీర్షికన నిర్వహించనుంది. నర్సరీ- కేజీ నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులందరూ ఈ పోటీలలో పాల్గొనవచ్చు. ఈ ఆన్‌లైన్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు సబ్మిషన్లు పూర్తి స్ధాయిలో జరుగుతున్నాయి. ఈ పోటీల ఆడిషన్లు, సెలక్షన్‌లు వర్ట్యువల్‌గా జరుగుతాయి. తుది దశ పోటీలు హైదరాబాద్‌లో భౌతికంగా జరుగుతాయి.

- Advertisement -

ఈ పోటీలకు దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేదీ నవంబర్‌ 25 వరకు.. దరఖాస్తు పత్రానికి లింక్‌ వెబ్‌సైట్‌ వద్ద లభ్యమవుతుంది. ఈసందర్భంగా టీ-సీఓ1 ఫౌండర్‌ అండ్‌ డైరెక్టర్‌ దివ్య జైన్‌ మాట్లాడుతూ… క్లాస్‌ ఆఫ్‌ ఒన్‌ పోటీలు జాతీయ స్థాయిలో జరుగుతాయన్నారు. భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ పోటీలకు హాజరవుతుండటం సంతోషంగా ఉందన్నారు. అత్యుత్తమ ప్రదర్శన ఈ పోటీ-ల్లో వారు కనబరిచాలని కోరుకుంటున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement