Friday, November 22, 2024

కోహ్లీకి లాస్ట్‌ చాన్స్‌? లేదంటే… వరల్డ్‌ కప్‌కు చోటు కష్టమే

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌ ఎంతో ముఖ్యం. ఈ సిరీస్‌లో ఎలాగైనా రాణించాలనే పట్టుదలతో కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు. గత కొంతకాలంగా ఏ ఫార్మాట్‌లోనూ రాణించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ టీ20 కెరీర్‌ని ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ పర్ఫామెన్స్‌ డిసైడ్‌ చేయనుంది. అతను ఆ రెండు మ్యాచుల్లో రాణించడాన్ని బట్టి విరాట్‌ టీ20 కెరీర్‌ని బీసీసీఐ నిర్ణయించనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఫెయిల్‌ అయితే కోహ్లీ టీ20 వరల్డ్‌ కప్‌ ఆడడం డౌటే. దీంతో అతని కెరీర్‌కే ముగింపు కార్డు పలికే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి ఒకరు ఈ విషయంపై స్పందిస్తూ… ఇంగ్లండ్‌ సిరీస్‌లో కోహ్లీ బాగా ఆడకపోతే ఇదే అతని ఆఖరి సిరీస్‌ కావొచ్చు. టీ20 ప్రపంచకప్‌-2022 జట్టులో స్థానం దక్కకపోవచ్చని కుండబద్దలు కొట్టాడు.

ఐసీసీ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలోనూ నెం.1 స్థానం అధిరోహించిన ఒకే ఒక్కడు విరాట్‌ కోహ్లీ. వన్డేల్లో, టెస్టుల్లో, టీ20ల్లో పరుగుల వరద పారించిన ఈ పరుగుల వీరుడికి ఇప్పుడు టైమ్‌ అస్సలు బాలేదు. రెండున్నరేళ్లుగా సెంచరీ చేయలేకపోతున్న విరాట్‌ కోహ్లీ, బ్యాటుతో ఫూర్‌ పర్ఫామెన్స్‌ కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోవాల్సి వచ్చింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2021 టోర్నీ తర్వాత విరాట్‌ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ, ఇప్పడు జట్టులో నుంచి కూడా తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నదని కథనాలు వస్తున్నాయి. కొంతకాలంగా విరాట్‌ కోహ్లీ ఫామ్‌ ఏమాత్రం మెరుగ్గా లేదు. ఈ ఏడాది 12 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 28.73 సగటుతో 431 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇందులో నాలుగు హాప్‌ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే మూడో స్థానంలో శ్రేయాస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి ప్లేయర్లు, విరాట్‌ కోహ్లీ కంటే వేగంగా పరుగులు చేస్తూ మాజీ కెప్టెన్‌ స్థానానికి ఎసరు పెడుతున్నారు. టీమిండియా కూడా టీ20ల్లో విరాట్‌ కోహ్లీని ఆడించకపోవడమే బెటర్‌ అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

”ప్రతి గొప్ప ప్లేయర్‌ తమ కెరీర్‌లో ఎప్పడో ఒకసారి ఇలాంటి పరిస్థితి ఫేస్‌ చేసినవాళ్లే. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ ఆడిన తీరు అవుటైన విధానం రెండూ అద్భుతంగానే ఉన్నాయి. అతను మంచిగా ఆడుతున్నప్పుడు పక్కన పెట్టాల్సిన అవసరం ఏముంది” అంటూ కోహ్లీ చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ కామెంట్‌ చేశాడు. టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ 97 మ్యాచులు ఆడి 51.50 సగటుతో 3296 పరుగులు చేశాడు. 124 టెస్టుల్లో 32.75సగటుతో 3308 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ కంటే విరాట్‌ కోహ్లీ టీ20 సగటు చాలా మెరుగ్గా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement