అమెరికా జాలరి వలకి అతి పెద్ద చేప చిక్కింది. ఈ చేప సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు దాన్ని చూసి షాక్ అవుతున్నారు. అమెరికా జాలరీకి దొరికిన ‘పేద్ద’ చేప వార్త ఫేస్బుక్లో కనెక్టికట్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ వేదిక ద్వారా వైరల్‌గా మారింది. జాలరి తన చేతులతో పట్టుకున్న చేప ఫొటోను కూడా జత చేశారు. ‘వేసవిలో చేపల వేట ఎలా కొనసాగుతుంది’ అనే కాప్షన్‌ను ఇచ్చారు. ఈ టైగర్ మస్కీ అనే పేరుగల పేద్ద చేపను షేర్ చేసిన జాలరీ జో రివాస్‌కు ధన్యవాదాలు అంటూ ఫొటో కింద రాశారు. ఈ టైగర్ మస్కీ అనే చేప.. ఉత్తర పైక్-మస్కెలుంజ్ క్రాస్ బ్రీడ్‌గా నెటిజెన్లు భావిస్తున్నారు. ఈ చేప దాదాపు 42 అంగుళాల పొడవు ఉన్నది. ప్రౌఢ దశలో ఈ చేపలు దాదాపు 30 పౌండ్ల వరకు బరువు తూగుతాయంట. ఇలాంటి క్రాస్ బ్రీడ్ చేపలు చాలా అరుదుగా ఉంటాయని వాషింగ్టన్‌లోని ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ విభాగం అధికారులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement