Tuesday, November 26, 2024

ఎల్‌అండ్‌టీకి భారీ ప్రాజెక్టు, టాంజానియాలో నీటి సరఫరా.. రిజర్వాయర్ల నిర్మాణ పనులు

లార్సన్‌ అండ్‌ టర్బో (ఎల్‌అండ్‌టీ) ఖాతాలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వచ్చి చేరింది. వాటర్‌ అండ్‌ ఎఫ్లూయెంట్‌ ట్రీట్మెంట్‌ బిజినెస్‌ అంతర్జాతీయ విభాగం.. టాంజానియాలోని వివిధ పట్టణాలకు నీటి సరఫరా వనరులు ఏర్పాటు చేసే ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ పొందింది. టాంజానియాలోని పలు పట్టణాలకు నీటి సరఫరా విషయంలో ఈ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా.. రా వాటర్‌ ఇంటేక్‌ సిస్టమ్‌, స్టోరేజీ ట్యాంకులు, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు (కెపాసిటీ 71 ఎంఎల్‌డీ), 5 క్లియర్‌ వాటర్‌ రిజర్వాయర్లు, పంపింగ్‌ స్టేషన్స్‌, 263 కిలో మీటర్ల మేర పైప్‌లైన్‌, ఎలక్ట్రోమెకానికల్‌ అనుబంధమైన పనులు చేపట్టే ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టుకు ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిధులను సమకూరుస్తుంది.

దేశీయంగా ఎల్‌ఎండ్‌టీకి మరో భారీ ప్రాజెక్టు లభించింది. యూపీలో రక్షిత మంచి నీటిని అందించే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక పనులు అప్పగించింది. రాష్ట్రంలో ఫంక్షనల్‌ హౌస్‌ ట్యాప్‌ కనెక్షన్‌లను (ఎఫ్‌హెచ్‌టీసీ) అందించడానికి జల్‌ జీవన్‌ మిషన్‌ కింద వివిధ గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా ప్రాజెక్టు చేపట్టనుంది. లార్సెన్‌ అండ్‌ టర్బో కంపెనీ.. ఈపీసీ ప్రాజెక్టులు, హైటెక్‌ తయారీలో నిమగ్నమై ఉన్న భారతీయ బహుళ జాతి సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా 50కు పైగా దేశాల్లో సేవలు అందిస్తున్నది. 8 దశాబ్దాలుగా నిర్మాణ రంగంలో పనులు చేపడుతూ.. ఈ రంగానికి నాయకత్వం వహిస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement