Tuesday, November 26, 2024

రెండో టెస్టుపై పట్టుబిగిస్తున్న లంక.. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌కు షాక్‌..

శ్రీలంక పర్యటనలో ఉన్న పాకిస్తాన్‌ కు రెండో టెస్టులో లంక బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కూడా లంక ఆధిపత్యం చెలాయిస్తున్నది. శ్రీలంకప్ఖాకిస్తాన్‌ మధ్య గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్టుపై ఆతిథ్య జట్టు పట్టుబిగిస్తున్నది. తొలి ఇన్నింగ్స్‌ లో లంకు 378 పరుగులకే ఆలౌట్‌ చేసిన పాకిస్తాన్‌.. తాము బ్యాటింగ్‌ చేస్తూ కుప్పకూలింది. తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన అబ్దుల్లా షఫీఖ్‌.. తొలి ఇన్నింగ్స్‌ లో డకౌట్‌ అయ్యాడు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, ఇమామ్‌ ఉల్ హక్‌, రిజ్వాన్‌, ఫవాద్‌ ఆలం లు విఫలమయ్యారు. ఓవర్‌ నైట్‌ స్కోరు 315 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన లంక.. మరో 63 పరుగులు జోడించి ఆలౌటైంది. దినేశ్‌ చండిమాల్‌ (80) టాప్‌ స్కోరర్‌. పాక్‌ బౌలర్లలో యాసిర్‌ షా, నజీమ్‌ షాలు తలో మూడు వికెట్లు తీశారు. నవాజ్‌ రెండు వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ లో బ్యాటింగ్‌ కు వచ్చిన పాకిస్తాన్‌ కు ఆదిలోనే షాక్‌ తగిలింది. పేసర్‌ అసిత ఫెర్నాండో.. అబ్దుల్లా షఫీఖ్‌ (0) ను ఇన్నింగ్స్‌ రెండో బంతికే బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత ఇమామ్‌ ఉల్ హక్‌ (32), బాబర్‌ ఆజమ్‌ (16), మ#హ్మద్‌ రిజ్వాన్‌ (24), ఫవాద్‌ ఆలమ్‌ (24) లు రాణించలేకపోయారు.

లంక స్పిన్నర్లు మెండిస్‌, ప్రభాత్‌ జయసూర్యలు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ పాక్‌ పై ఒత్తిడి పెంచారు. వరుసగా వికెట్లు పడుతున్నా అగ సల్మాన్‌ (126 బంతుల్లో 62, 4 ఫోర్లు, 1 సిక్సర్‌) మాత్రం పట్టుదలగా ఆడాడు. లంక స్పిన్నర్లను ధాటిగా ఎదుర్కున్నాడు. హాఫ్‌ సెంచరీ చేసుకున్న అతడిని జయసూర్య బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం ఆ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 69.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇంకా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ లో 187 పరుగులు వెనుకబడి ఉంది. ఇదే వేదికమీద ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో పాకిస్తాన్‌ ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌ లో లంక చివరికంటా పోరాడినా అబ్దుల్లా షఫీఖ్‌ అద్భుత సెంచరీతో పాక్‌ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement