Friday, November 22, 2024

పాక్‌- శ్రీలంక టెస్ట్‌ సిరీస్ లో కుప్పకూలిన లంక..

పాకిస్తాన్‌- శ్రీలంకల మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు, తొలి రోజు బౌలర్లే ఆధిపత్యం చెలాయించారు. మొత్తం 12 వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌ చేసినన శ్రీలంక 222 పరుగులకే కుప్పకూలగా, అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌ జట్టు బ్యాటర్లు కూడా రాణించలేకపోయారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాక్‌ 2 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. ఇరు జట్ల బౌలర్లు అద్భుతంగా రాణించారు. దీంతోనే తొలి రోజే 12 వికెట్లు పడగొట్టారు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే… టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ ఒసాడ ఫెర్నాండో (35) రాణించి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె (1) తీవ్ర నిరాశ పరిచాడు. దినేష్‌ చండిమల్‌ (76) అర్ధసెంచరీతో కదం తొక్కగా, మహీష్‌ తీక్షణ (38), కుశాల్‌ మెండిస్‌ (21) మినహా ఎవరూ రాణించలేకపోయారు.

దీంతో 66.1 ఓవర్లలో శ్రీలంక 222 పరుగులకే ఆలౌటైంది. పాక్‌ బౌలర్లలో షహీన్‌ షాహ్‌ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టగా, హసన్‌ అలీ, యాసిర్‌ సాహ్‌ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌ జట్టు ఓపెనర్లు అబ్దుల్లా షఫీఖ్‌ (13), ఇమామ్‌-ఉల్‌-హక్‌ (2) తీవ్ర నిరాశపరిచారు. దీంతో పాక్‌ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్‌ 2 వికెట్లు కోల్పోయి 24 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం అజర్‌ ఈలీ 3, కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. లంక బౌలర్లలో కసున్‌ రజిత, ప్రబాథ్‌ జయసూర్య చెరో వికెట్‌ పడగొట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement