Saturday, November 23, 2024

భారీ వర్షం కారణంగా విరిగి పడిన కొండచరియలు.. కోరాపుట్‌ – రాయగడ లైన్‌లో చెట్లు బండరాళ్లు..

విశాఖ, ప్రభన్యూస్‌: ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే డివిజన్‌ పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పలు చోట్ల కొండచరియలు విరగపడడంతో కీట్‌గూడా సెక్షన్‌ సమీపంలో కోరాపుట్‌ -రాయగడ లైన్‌లో చెట్లు, బండరాళ్లు ట్రాక్‌ పై పడినందున రైలు రాకపోకలుకు దెబ్బతిన్నాయి. ఈనేపద్యంలో పలు రైళ్లు రద్దు అయ్యినట్లు రైల్వే అధికార్లు ప్రకటించారు. విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు నెబర్‌ 08546 విశాఖపట్నం టు కోరాపుట్‌ రైలు రాయగడలో షార్ట్‌ టర్నినేట్‌ చేశారని, రాయగడ నుంచి విశాఖపట్నం కు వచ్చే 08545 తిరిగి వస్తుందన్నారు.

కోరాపుట్‌ నుంచి బయలుదేరే రైలు నెంబర్‌ 08545 కోరాపుట్‌ టు విశాఖపట్నం రైలు శిఖర్‌ పాయి వద్ద షార్ట్‌ టర్నినేట్‌ చేశారని, సిఖర్‌ పై నుంచి కోరాపుట్‌కు 08546 గా తిరిగి వస్తుందన్నారు. వాల్టెర్‌ డివిజన్‌ శిఖర్‌పై స్టేషన్‌లో చిక్కుకుపోయిన ప్రయాణీకులకు రిఫ్రెష్‌మెంట్‌ అందించినట్లు తెలిపారు. రైలుసర్వీసులు వీలైనంత త్వరగా పునరుద్దరించేందుకు రైల్వే అధికార్లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కె. త్రిపాఠి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement