తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పునర్ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యాదాద్రి కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇంకా ఆలయ పునర్ నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి కాబట్టి… ఆలయం ప్రారంభం కాలేదు. దీంతో భక్తుల తాకిడి తక్కువగా ఉంది.
కాగా ఇటీవల యాదాద్రి పునర్ నిర్మాణ పనుల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆలయ నిర్మాణ పనులను అధికారులు పకడ్బందీగా నిర్వహించకపోతే భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి.. కొండచరియలు విరిగిపడటం లాంటి చర్యలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ వార్త కూడా చదవండి: టీఆర్ఎస్‌కు సామ వెంకటరెడ్డి రాజీనామా