Friday, October 18, 2024

Landslides: పాపువా న్యూగినీలో కొండచ‌రియ‌లు విరిగిప‌డి.. 2వేల మంది సజీవ స‌మాధి

పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న‌ది.. ఇప్ప‌టికే శిథిలాల కింద నుంచి రెండు వేల మృత‌దేహాల‌ను వెలికితీశారు.. శిథిలాల కింద చిక్కుకున్న‌ వంద‌లాది మందిని ర‌క్షించేందుకు స‌హాయ కార్య‌క్ర‌మాలు చేపట్టింది ఐక్య రాజ్య‌ స‌మితి బృందం. ఈ మాన‌వ మ‌ర‌ణాలను ఈ శ‌తాబ్ధంలోనే అత్యంత విషాద ఘ‌ట‌న‌గా అభివ‌ర్ణించింది యుఎన్ ఓ..

ఇదిలా ఉంటే శుక్రవారం తెల్లవారుజామున ఈ దేశంలోని ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంపై మౌంట్‌ ముంగాల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దెబ్బకు ఆ ప్రావిన్స్‌లో చాలా ప్రాంతాలు తుడిచి పెట్టుకుపోయాయి. తొలుత పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయని భావించారు. కానీ, భారీ భవనాలు, పంటలు కూడా వీటి కింద చిక్కుకుపోయినట్లు తేలింది. పోర్గెర మైన్‌కు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ఈ ఘటనలో తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

- Advertisement -

ఈ కొండచరియలు విరిగి పడిన ఘటనలో 2వేల‌ మంది ప్రజలు సజీవ సమాధి అయ్యారని ఆ దేశంలోని నేషనల్‌ డిజాస్టర్‌ సెంటర్ సోమవారం వెల్ల‌డించింది. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది. కొన్ని చోట్ల 8మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పలు పడినట్లు వెల్ల‌డించింది.

ఇప్పటికీ చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో.. శిథిలాల కిందే ఉండిపోయిన క్షతగాత్రుల ప్రాణాలకు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలకు సవాల్‌గా మారింది. స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను ఐక్య‌రాజ్య స‌మితి స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement