చత్తీస్ గడ్ లో మందుపాతర పేలుడు
భద్రతా సిబ్బంది వాహనం పేల్చివేత
చత్తీస్ గడ్ – ఇటీవల జరుగుతున్న ఎన్ కౌంటర్ల కు మావోయిస్ట్ లు తీవ్రంగా స్పందించారు.. ఏకంగా మందుపాతర పేల్చి తొమ్మిది మంది జవాన్లను బలి తీసుకున్నారు.. ఈ ఘటన చత్తీస్ గడ్ లోని బీజ్ పూర్ లో చోటు చేసుకుంది.. కూబింగ్ లో భాగంగా జవాన్లు వాహనంలో వెళుతుండగా మందుపాతరతో దానిని పేల్చి వేశారు.. ఆ సమయంలో వాహనంలో 15 మంది జవాన్లున్నారు.. పేలుడు దాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. స్పాట్ లోనే ఏడుగురు జవాన్లు కన్నుమూశారు.. విషయం తెలిసిన వెంటనే అక్కడికి సహాయ సిబ్బందిని, అదనపు బలగాలను తరలించారు.. గాయపడిన వారిని హెలికాప్టర్ లో హాస్పటల్ కు తరలించారు..
- Advertisement -