Friday, October 18, 2024

Landed in Canada – మ‌రో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు బాంబు బెదిరింపు

న్యూ ఢిల్లీ – న్యూ ఢిల్లీ నుంచి అమెరికాలోని చికాగోకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావ‌డంతో ఆ విమానాన్ని కెన‌డాకు దారి మ‌ళ్లించారు. గ్రాండ్ కంట్రోల్ నుంచి బాంబు స‌మాచారం అందడంతో ఫైలెట్ స‌మీప దేశం కెనడాలోని ఇకల్యూట్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. అక్క‌డ విమాన గ్రౌండ్ కంట్రోల్ తో మాట్లాడి అత్య‌వ‌స‌రంగా అక్క‌డి విమానాశ్ర‌యంలో సేఫ్ గా ల్యాండ్ చేశారు.. అనంత‌రం ప్ర‌యాణీకుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించి బాంబు త‌నిఖీలు చేప‌ట్టారు. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement