Friday, November 15, 2024

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూ సర్వే : మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో భూ సర్వే పూర్తి చేస్తామని మాజీ కేంద్రమంత్రి, ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 80 ఏళ్ల క్రితం భూ సర్వే జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 విధాలుగా భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. ధరణి సమస్యలన్నీ 100 రోజుల్లో పరిష్కరిస్తామని, రెండేళ్లలో భూ సర్వే పూర్తి చేసి ఒక పట్టా ఒక రికార్డు ఏర్పాటు చేస్తామన్నారు. భూమికోసం ప్రస్తుతం 125 చట్టాలు 3000 జీవోలు ఉన్నాయని, వాటన్నింటినీ రద్దుచేసి ఒక్కటే చట్టం తీసుకువస్తామన్నారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో భూసేకరణ చట్టం ప్రవేశపెట్టిందన్నారు. దీని ప్రకారం భూ యజమానుల అనుమతి లేకుండా ప్రభుత్వం భూ సేకరణ చేయకూడదని స్పష్టంగా తెలియజేశామన్నారు 2015లో తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం చట్టాన్ని మార్చి భూ యజమానుల అనుమతి లేకుండా ప్రాజెక్టుల కోసం భూములను తీసుకున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే భూ యజమాని అనుమతి లేకుండా భూసేకరణ జరగకుండా చూస్తామన్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులకు క్రాఫ్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ తో పాటు ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పథకాలన్నీ కౌలు రైతులకు అందేలా చూస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement