Saturday, November 23, 2024

లాంబ్డా మరింత డేంజర్: డబ్ల్యూహెచ్ఓ ఆందోళన

కరోనా వైరస్ కొత్త రూపాంతరం లాంబ్డా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. గత నాలుగు వారాల్లో ఈ వేరియంట్ ను దాదాపు 30 దేశాల్లో గుర్తించారు. ప్రస్తుతం మరిన్ని దేశాలకు ఈ వేరియంట్ విస్తరిస్తోంది. ఈ వేరియంట్ కు లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా దేశాలు భయపడుతున్నాయి.కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉన్న పెరూ దేశం నుంచి లాంబ్డా వైరస్ జాతి ఉద్భవించిందని మలేసియా ఆరోగ్యశాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

యూకేలో గుర్తించిన లామ్డా వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు ప్రమాదకరమైనదని తెలిపింది. పెరూలో గత రెండు నెలల్లో వెలుగు చూసిన కరోనా నమూనాల్లో లాంబ్డా దాదాపు 82 శాతం ఉందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. లామ్డా వేరియంట్ వేగంగా ప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. చిలీ దేశంలో 31 శాతం కేసుల్లో ఈ వేరియంట్ కనిపించింది. లాంబ్డా మరింత వేగంగా విస్తరిస్తుందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు జైలు శిక్ష

Advertisement

తాజా వార్తలు

Advertisement