రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత, మాజీ కేంద్రమంత్రి లాలూ ప్రసాద్ యావద్ ఆరోగ్యం విషమంగా ఉంది. కొద్దిరోజులుగా అస్వస్థతతో ఉన్న లాలూ పాట్నాలోని పరస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఐసీయూలో చికిత్స పొందుతుండగా బుధవారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం విషమించింది. విషయం తెలిసి ఆస్పత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, లాలూ తనయుడు తేజస్వితో మాట్లాడారు. లాలూను చూసి వచ్చాక ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మరింత మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఢిల్లిలోని ఎయిమ్స్‌కు తరలించే అవకాశాలున్నాయి. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ లాలూ ఆరోగ్యంపై మంగళవారం రాత్రి తేజస్వినితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆదివారంనాడు లాలూ ప్రసాద్ యాదవ్ తన ఇంట్లో మెట్లపైనుంచి కిందపడిపోవడంతో కుడి భుజం విరిగింది. వీపు, ఛాతీపై గాయలయ్యాయి. అప్పటినుంచి ఐసీయూలో ఉన్నారు. అయితే, కొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు చికిత్స చేయడం సవాలుగా మారింది. సతీమణి రబ్రీదేవికి ప్రభుత్వం సమకూర్చిన వసతిగృహంలో లాలూ ఉంటూండగా ఈ ప్రమాదం జరిగింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.