2015 ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊరట లభించింది. లాలూ నిర్ధోషిగా బయటపడ్డారు. 2015లో లాలూ తన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ తరపున రాఘవాపూర్‌లో ప్రచారం చేస్తూ అసెంబ్లీ ఎన్నికలను వెనుకబడిన కులాలు, అగ్ర కులాల మధ్య యుద్ధంగా అభివర్ణించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏను ఓడించేందుకు యాదవ్‌లు, ఇతర వెనుకబడిన కులాల వారు లౌకిక కూటమికి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. లాలూ ప్రసాద్ కులాల మధ్య చిచ్చు రేపే వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈకేసులో ఆయన నిర్ధోషిగా బయటపడడంతో ఆయనకు ఊరట లభించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement