ఇండియాలో కరోనాపై పోరుకు ఐపీఎల్ లాభాల నుంచి రూ.700 నుంచి రూ.800 కోట్లను బీసీసీఐ ఇవ్వాలని ఐపీఎల్ లీగ్దీ మాజీ చైర్మన్ లలిత్ మోడీ డిమాండ్ చేశారు. ఇక ఇండియా కొవిడ్ సంక్షోభంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నా ఐపీఎల్‌లోని ఇండియన్ ప్లేయర్స్ ఏ సాయం చేయకపోవడం సిగ్గు చేటని అన్నాడు లలిత్ మోదీ. ఇండియా ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్తు సందర్భంగా ఇండియన్ క్రికెటర్లు ఎలా స్పందించారో చరిత్ర ఎన్నటినీ మరవదు. ప్రజల కోసం మన ప్లేయర్స్ ఏమీ చేయడం లేదన్న కారణంగా నేను గత కొన్ని రోజులుగా ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా చూడలేదు అని మోదీ చెప్పాడు. లీగ్‌గానీ, ప్లేయర్స్‌గానీ ఏమీ చేయలేకపోవడం సిగ్గు చేటు అని మోదీ అనడం విశేషం. రోజువారీగా ఈ సమస్యపై స్పందించకపోవడం తనను దిగ్బ్రాంతికి గురి చేసిందని అన్నాడు.
నిజానికి ఇప్పటికే ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమిన్స్‌తోపాటు ఇండియన్ ప్లేయర్స్ అజింక్య రహానే, శిఖర్ ధావన్, హార్దిక్, కృనాల్ పాండ్యాలాంటి వాళ్లు కొవిడ్‌పై పోరుకు తమ వంతు సాయం ప్రకటించారు. అటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా రూ.కోటి విరాళమిచ్చి.. మిగతా క్రికెటర్లు కూడా ఇవ్వాలని కోరాడు. ప్రస్తుతం లలిత్ మోదీ లండన్‌లో తలదాచుకుంటున్నాడు.