భారత యువ షట్లర్ లక్ష్య సేన్ బుధవారం జపాన్ ఓపెన్ 2023 మ్యాచ్ లో గెలిచి రేపు జరగనున్న రౌండ్ ఆఫ్ 16లో తన స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇవ్వాల జరిగిన మెన్స్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లోని త్రీ సెట్ మ్యాచ్ లో.. తన తోటి జాతీయ ఆటగాడు ప్రియాంషు రజావత్ తో పోటీ పడ్డాడు లక్ష్య సేన్. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో 21-15, 12-21, 24-22 స్కోర్‌లైన్‌తో ప్రియాంషు రజావత్ విజయం సాధించడంతో సేన్ విజేతగా నిలిచాడు. ఇక రేపు జరగనున్న రౌండ్ ఆఫ్ 16 ప్రీ-క్వార్టర్‌ఫైనల్ లో జపాన్‌కు చెందిన కాంటా సునేయామా తో పోటీ పడనున్నాడు లక్ష్య సేన్.
అయితే, మహిళల సింగిల్స్‌లో రౌండ్-32 పోరులో 21-12, 21-13 పాయింట్ల తేడాతో చైనాకు చెందిన జాంగ్ యిమాన్‌తో పరాజయంతో మరో సారి నిరాశ పరిచింది పివి సింధు.
మరోవైపు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో మిథున్ మంజునాథ్ 21-13, 22-24, 18-21తో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్ చేతిలో ఓడిపోయాడు.
పురుషుల డబుల్స్ విభాగంలో భారత స్టార్ ప్లేయర్స్ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ద్వయం ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కార్నాండో, డేనియల్ మార్థిన్‌ల పై 21-16, 11-21, 21-13 తేడాతో విజయం సాధించారు. దీంతో వరల్డ్ నంబర్ 2 ర్యాంక్‌ను కైవసం చేసుకున్న భారత ద్వయం రేపు జరగనున్న రౌండ్ ఆఫ్ 16 లో ప్లేస్ ని కన్ఫామ్ చేసుకున్నారు.