Wednesday, November 20, 2024

Delhi: లక్ష్మీపార్వతికి చుక్కెదురు.. చంద్రబాబు ఆస్తులపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సతీమణి, వైసీపీ నేత లక్ష్మీపార్వతికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీరెవరని ధర్మాసనం ప్రశ్నించింది. ఎవరి ఆస్తులు ఎవరికి తెలియాలని వ్యాఖ్యానించింది.

ఆమె పేర్కొన్న అంశాలకు విలువ లేదంటూ పిటిషన్‌ను తిరస్కరించింది. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో చంద్రబాబు పేర్కొన్న ఆస్తుల వివరాల ఆధారంగా 2005లో లక్మీపార్వతి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆమె పేర్కొన్నారు. హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేయగా, లక్ష్మీపార్వతి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పుడు హైకోర్టు పరిగణనలోకి తీసుకున్న అంశాలనూ సుప్రీంకోర్టు గుర్తు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement