Tuesday, November 19, 2024

పోలీస్ ఉద్యోగాల‌కు ప‌రుగులు…

కానిస్టేబుల్‌ పోస్టులకు 5 లక్షల దరఖాస్తులు
22న ప్రిలిమినరీ… 12 నుంచి హాల్‌టికెట్లు
ఎస్‌ఐ పోస్టుల దరఖాస్తుకు 18 వరకు గడువు
కేవలం 411 పోస్టులకు ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ వెలువ డిన నేపధ్యంలో నిరుద్యోగ యువత తీవ్ర స్ధాయి లో పోటీ పడుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే తపన, చాలాకాలంగా నిరీక్షణ వారిలో మరింత పట్టుదలను పెంచుతోం ది. అందుకే రాష్ట్రంలో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా పోలీసుశాఖలో పని చేయాలనే ఆసక్తి కలిగిన ఎంతో మంది గత మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆ సమయం రానే వచ్చింది. ఏకంగా 6,511 పోలీసు ఉద్యోగాలకు ప్రభుత్వం నవంబర్‌ 28న నోటిఫికేషన్‌ జారీ చేయగా కేవలం కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు రాష్ట్రంలో 5 లక్షల మందికి పైగా పోటీ పడుతుండటం గమనార్హం. పైగా వీరిలో అత్యధిక మంది డిగ్రీ పైబడి చదివిన వారే. పోస్టుకు కావాల్సి న విద్యార్హతకు మించి ఉండటంతోపాటు కంప్యూటర్‌, ఇతర కోర్సులు అభ్యసించిన వారు ఉన్నారు. అంటే దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ కొలువుల్లో చేరాలని చాలాకాలంగా నిరుద్యోగుల నిరీక్షణ స్పష్టమవుతోంది.

పోలీసుశాఖలో సివిల్‌, ఏపీఎస్‌పీ విభాగాలకు సంబంధించి స్త్రీ, పురుషుల కు కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. దీనిలో భాగంగా కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు ఈనెల 12వ తేదీన హాల్‌ టికె ్కట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఏపీ స్టేట్‌ లెవల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు కల్పించింది. ప్రభుత్వం ప్రకటించిన 6511 పోలీసు ఉద్యోగాల్లో 6,100 కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు జనవరి 7తో ముగిసింది. వాస్తవానికి కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు డిసెంబర్‌ 28వ తేదీ కాగా అభ్యర్ధుల నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు ప్రభుత్వం జనవరి వ తేదీ వరకు పొడిగించింది. మార్పులు, చేర్పుల కోసం మరో రెండు రోజులు వెసులుబాటు కల్పించింది.

కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వ శాఖల్లో ఒకటైన పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు తీవ్రంగా పోటీ- నెలకొంది. భర్తీ కోసం ప్రకటించిన 6100 కానిస్టేబుల్‌ ఒక్కో పోస్టుకు 83 మంది అభ్యర్థులు పోటీ-లో ఉన్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు జనవరి 12 నుంచి అందుబాటు-లోకి రానున్నాయి. అభ్యర్థులు పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటు-ంది. ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారికి ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ -టె-స్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ -టె-స్ట్‌ నిర్వహించిన మీదట వాటిలో క్వాలిఫై అయితే మెయిన్‌ ఎగ్జామ్‌ ద్వారా పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.

- Advertisement -

ఎస్‌ఐ పోస్టులకు18 వరకు అవకాశం..

ఏపీ పోలీసు రి క్రూట్‌మెంట్‌ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం కానిస్టేబుల్‌ ఉద్యోగాల దరఖాస్తు గడువు ముగియగా, ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు గడువు ఈనెల 18వ తేదీ వరకు ఉంది. మొత్తం 6511 పోస్టుల్లో 6100 కానిసే ్టబుల్‌ పోస్టులు మినహాయించగా మిగిలిన 411 పోస్టులు సివిల్‌ పురుషులు/మహిళలు, ఏపీఎస్‌పీ పురుషులు ఎస్‌ఐ/ఆర్‌ఎస్‌ఐ ఉద్యోగాలు మాత్రమే. కేవలం 411ఎస్‌ఐ, ఆర్‌ఐ పోస్టులకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 18 వరకు ఉన్నందున ఆరోజు పూర్తి సంఖ్య తెలియనుంది. ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు వచ్చేనెల ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాతపరీక్ష జరుగునుంది. ఈ పరీక్షలో అర్హులైన అభ్యర్ధులకు శారీర దారుఢ్య పరీక్షలు నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి మెయిన్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో పాసైతేనే ఉద్యోగం దక్కుతుంది.

రిజర్వేషన్‌ పెంపుతో మరింత పోటీ..

కాగా ప్రస్తుతం కొనసాగ ుతున్న పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రిజర్వేషన్‌ విధానంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణతో నిరుద్యోగుల పోటీ మరింత పెరిగింది. పైగా హోంగార్డులకు సైతం అవకాశం కల్పించడం వీరికి లభించే కోటాలో రిజర్వేషన్‌ పెంపుతో అధికంగానే పోటీ పడు తు న్నారు. సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టుల్లో హోంగార్డులకు రిజర్వేషన్లను 8 నుండి 15 శాతానికి అదే విధం గా ఏపీఎస్‌పీ కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధించి హోంగార్డులకు రిజర్వేషన్లను 10 నుండి 25 శాతా నికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వీరికి మరింత వెసులుబాటు లభించినటైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement