లఖింపూర్ ఖేరి హింసాకాండలో నలుగురు రైతులు సహా తొమ్మిది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. లఖింపూర్ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించబోతున్నది. సీబీఐ చేత విచారణ చేయించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అటు లఖింపూర్ ఘటనపై రైతులు మండిపడుతున్నారు. అటు, ప్రతిపక్షాలు కూడా ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం లఖింపూర్‌లోకి ఎవర్నీ అనుమతించడం లేదు. 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అయితే,కాగా, నిన్నటి రోజున కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, రాహుత్ గాంధీలు లఖింపూర్ వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. పంజాబ్, చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రులు బాధిత కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారాన్ని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో రేషన్ కార్డుల లెక్క ఇదీ..