lucknow: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో రైతులపైకి కారు ఎక్కించిన కేసులో ప్రధాన నిందితుడు అయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా డెంగీ ఫీవర్ నుంచి కోలుకున్నారు. లఖింపూర్ జిల్లా జైలులో ఉన్న ఆయన డెంగీతో ఇబ్బంది పడుతున్న కారణంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్టు డిస్ట్రిక్ట్ జైల్ సూపరింటెండెంట్ పీపీ సింగ్ తెలిపారు.
అయితే.. గత ఆదివారం ఆశిష్ రక్త నమూనాను సేకరించి లఖ్‌నవూలోని లాబరేటరీకి తరలించి పరిశీలించగా అతడికి వెక్టార్ బోర్న్ అనే వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆశిష్ ను కొద్ది రోజులపాటు హాస్పిటల్లోనే ఉంచి చికిత్స అందించాలని ఆప్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మంగళవారం సాయంత్రం జ్వరం నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఆశిష్ ను మళ్లీ జల్లా జైలుకు తరలించినట్టు అధికారులు తెలిపారు.