ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల విస్తరణ కోసం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షకు పైగా టవర్లు ఏర్పాటు చేసింది. ప్రత్యర్ధి టెలికం సంస్థల కంటే ఐదు రెట్లు ఎక్కువ టవర్లు ఏర్పాటు చేసింది. జియో ఇప్పటికే 700 ఎంహెచ్‌జడ్, ,3500 ఎంహెచ్‌జడ్ ఫ్రీక్వెన్సీలో ఇప్పటికే 98,897 బేస్ ట్రాన్సీవర్ స్టేషన్లను ఏర్పాటు చేసిందని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వెల్లడించింది.
మరో ప్రముఖ టెలికం సంస్థ ఇదే సమయంలో 22,219 బేస్ ట్రాన్సీవర్ స్టేషన్లను ఏర్పాటు చేసిందని డిఓటీ తెలిపింది. ప్రతి బేస్ స్టేషన్‌కు ఎయిర్ టెల్ రెండు సెల్ సైట్స్ ఏర్పాటు చేయగా, జియో మాత్రం మూడ సేల్ సైట్స్ ఏర్పాటు చేసింది. ఎయిర్‌టెల్ సగటున 268 ఎంబీపీఎస్ వేగంతో 5జీ సేవలు అందిస్తుండగా, జియో మాత్రం 506 ఎంబీపీఎస్ వేగంతో అన్నింటికంటే ముందుంది. నెట్‌వర్క్ స్పీడ్ టెస్టింగ్ సంస్థ ఊక్లా తన నివేదికతో పేర్కొంది. ఎయిర్‌టెల్ 500 నగరాలకు 5జ సవలను విస్తరించగా, జియో400 నగరాలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది.