Sunday, November 3, 2024

లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే చేయాలి : టీడీపీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామన్న హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ విషయమై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌ మాట్లాడుతూ… 2018 ఎన్నికల్లో లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చిందన్నారు. ఆ మేరకు 36.68లక్షల మంది రైతులకు రూ.19, 198.38కోట్లను మాఫీ చేయాల్సి ఉందన్నారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో 1148.38కోట్లను విడుదల చేసి 5లక్షల66వేల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మిగతా వారిని విస్మరించారని విమర్శించారు.

ఇంకా 31లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తోందన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీ పెరిగి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బ్యాంకులకు రుణమాఫీ కోసం నిధులు విడుదల చేసి బ్యాంకుల్లో ఉన్న రైతుల పాస్‌పుస్తకాలను ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement