- తక్షణ విచారణకు అధికారుల బృందం
- సీఎస్, డీజీపీకి నోటీసులు
కొడంగల్ లగచర్లలో కలెక్టర్, అధికారులపై రైతుల దాడి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల సంఘం ఈఘటనను సుమోటోగా స్వీకరించింది. తక్షణ విచారణ కోసం తమ అధికారుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపాలని నిర్ణయించింది.
అదేవిధంగా, రెండు వారాల్లోగా ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్‌లకు నోటీసులు జారీ చేసింది.