Friday, November 22, 2024

టైమ్‌ జాబితాలో లడఖ్‌, మయూర్‌భంజ్‌.. వరల్డ్‌ టాప్‌-50 ప్రదేశాల్లో చోటు

ప్రపంచ అత్యుత్తమ ప్రాంతాల జాబితాలో రెండు భారత పట్టణాలకు గుర్తింపు లభించింది. ఒడిశాలోని మయూర్‌భంజ్‌, కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌ ఈ విశిష్టతను పొందాయి. 2023 ఏడాదికి టైమ్‌ మేగజైన్‌ రూపొందించిన ప్రపంచ టాప్‌-50 ప్రాంతాల జాబితాలో ఈ రెండు పట్టణాలు చోటు దక్కించుకున్నాయి. అంతరించిపోతున్న పులులు, చారిత్రక దేవాలయాలు, అలాగే వారి సాహసచరిత్ర, వంటకాల పరంగా ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాకు ఎంపిక చేయబడ్డాయి. ఈ జాబితా ప్రస్తుత సమయంలో సుస్థిరత, ప్రామాణికత అనే రెండు పెద్ద ధోరణులను ప్రతిబింబిస్తుందని టైమ్స్‌ సీనియర్‌ ఎడిటర్‌ ఎమ్మా బార్కర్‌ పేర్కొన్నారు. ఈ జాబితాలోని అనేక స్థానాలు మరింత పరిమిత పర్యావరణ ప్రభావంతో పర్యాటకులను సందర్శించడానికి మార్గాలను అన్వేషిస్తున్నాయి.

- Advertisement -

లడఖ్‌ ఆశ్చర్యకరమైన ప్రదేశంగా ఉంది. ఆల్ఫైన్‌ ప్రకృతి దృశ్యాలు, టిబెటన్‌ బౌద్ధ సంస్కృతి దీని ప్రత్యేకత. అలాగే, భారతదేశం తన మొదటి డార్క్‌ స్కై రిజర్వ్‌ను లడఖ్‌ రాజధాని లేహ్‌కు ఆగ్నేయంగా 168 మైళ్ల దూరంలో ఉన్న #హన్లే గ్రామంలో ఏర్పాటుచేసింది. ఇక గ్రిల్డ్‌ మాంసాలు, నాథూస్‌ స్వీట్‌లకు సంబంధించి గతేడాది ఆగస్టులో ఇక్కడ ఔట్‌లెట్‌లు తెరవబడ్డాయి. రొయ్యల భోజనం కోసం సీ బక్‌థార్న్‌, ఫన్‌డ్యూ లేదా స్పైసీ ఫ్రైడ్‌ చికెన్‌ భోజనం కోసం కేఫ్‌ మోంటాగ్నే ఔట్‌లెట్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. లేహ్‌ నుండి 5 గంటల ప్రయాణంలో టుర్టుక్‌ విలేజ్‌కి వెళ్లే వారికి ఫార్మర్స్‌ హౌస్‌ కేఫ్‌ ప్రత్యేక ఆకర్షణ.

ఇక మయూర్‌ గంజ్‌ గురించి చెప్పాలంటే, చాలా అరుదైన నల్లపులిని గుర్తించడానికి భూమిపై ఉన్న ఏకైక ప్రదేశం ఇదేనని టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ఈ ఏప్రిల్‌లో, మయూర్‌భంజ్‌ ఛౌ, యునెస్కో ఇన్‌టాంజిబుల్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ జాబితాలో ఆకర్షణీయమైన నృత్య ఉత్సవం వైభవంగా జరుగుతుంది అని ఈ పత్రిక నివేదించింది.

ఫ్రెంచ్‌ పాలినేషియాలోని టువామోటు ద్వీపసమూహం స్థానిక నివాసికి ఒక విదేశీ సందర్శకుడిని మాత్రమే అనుమతించే దిశగా కదులుతోంది. సాంస్కృతికంగా శక్తివంతమైన మహానగరంగా వికసించిన కొలంబియాలోని మెడెలిన్‌ నగరం మాదిరిగా ఇతర ప్రాంతాలు రూపాంతరం చెందుతున్నాయని టైమ్‌ మేజగైన్‌ పేర్కొంది.

టాప్‌-50 ప్రదేశాలలో టంపా-ఫ్లోరిడా, విల్లామెట్‌ వ్యాలీ- ఒరెగాన్‌, రియో గ్రాండే – పిఆర్‌, టక్సన్‌- అరిజోనా, యోస్మైట్‌ నేషనల్‌ పార్క్‌- కాలిఫోర్నియా, బోజ్మాన్‌, మోంటానా – వాషింగ్టన్‌ డిసి, వాంకోవర్‌, చర్చిల్‌, మానిటోబా డిజోన్‌- ఫ్రాన్స్‌, పాంటెల్లెరియా – ఇటలీ, నేపుల్స్‌- ఇటలీ, ఆర్హస్‌- డెన్మార్క్‌, సెయింట్‌ మోరిట్జ్‌ – స్విట్జర్లాండ్‌, బార్సిలోనా – టిమిసోరా, రొమేనియా సిల్ట్‌ – జర్మనీ, బెరత్‌ – అల్బేనియా, బుడాపెస్ట్‌, వియన్నా, బ్రిస్బేన్‌- ఆస్ట్రేలియా, కంగారూ ద్వీపం- ఆస్ట్రేలియా తదితర ప్రదేశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement