ఓ బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. క్రమంగా ఆ మంటలు షాప్ మొత్తం విస్తరించాయి. దాంతో ఆ దుకాణం మంటలకి ఆహుతి అయింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద జరిగింది. చార్మినార్లోని లాడ్ బజార్లో రెండంతస్తుల భవనంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి షాప్ మొత్తం విస్తరించాయి. దీంతో దుకాణం పూర్తిగా దగ్ధమయింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. షాట్సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement