హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు, వైద్య విధానపరిషత్‌లో 183 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 21 తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 8వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ. నవంబరు 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. వందపాయింట్ల ఆధారంగా తుది ఎంపిక ఉంటు-ంది. ఆన్‌లైన్ పరీక్షకు 80 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసుకు 20 పాయింట్ల చొప్పున ఉంటాయని ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి…
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టులు 1088 భర్తీ కానుండగా, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పోస్టులు 183 ఉన్నాయి. ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్‌లో 13 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సెప్టెంబర్ 21న ప్రారంభం కానుండగా, ఆన్‌లైన్‌లో అక్టోబర్ 5ను చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 7 నుంచి 8 వరకు దరఖాస్తుల్లో సవరణలకు అనుమతినిస్తారు. నవంబరు 10 రాత పరీక్ష ఉండనుంది.