Tuesday, November 19, 2024

Lab Cultivation – ల్యాబ్ లో కృత్రిమ చికెన్ – అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ..

కాలిఫోర్నియా – కృత్రిమ చికెన్ మార్కెట్ లోకి వ‌చ్చేసింది.. కోళ్ల ఫామ్ లో కాకుండా . ల్యాబ్ లో ఈ చికెన్ ను త‌యారు చేశారు… ఇలా ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ ను విక్రయించుకునేందుకు మొదటిసారిగా అమెరికా ఎఫ్ డీఏ రెండు కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. ల్యాబ్ లో జంతు కణాలను వృద్ధి చేయడం ద్వారా ఈ చికెన్ ను ఉత్పత్తి చేస్తారు. తొలుత రెస్టారెంట్లలో అమ్మకాలు మొదలు పెట్టి, తర్వాత సూపర్ మార్కెట్లలోనూ అందుబాటులో ఉంచనున్నారు. ఈ చికెన్ రుచిగా ఉండి, ఆహార ప్రియుల ఆదరణ చూరగొంటే జంతువులకు ప్రాణహాని తగ్గనుంది.


దీనివల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది. జంతువుల పెంపకం, వాటికి దాణా, వాటి నుంచి వెలువడే వ్యర్థాల సమస్యలకు పెద్ద పరిష్కారం లభిస్తుంది. ఈట్ జస్ట్ కంపెనీ గుడ్ మీట్ పేరుతో ల్యాబ్ గ్రోన్ చికెన్ ను మార్కెట్ చేస్తోంది. ఈ సంస్థతోపాటు జోనిన్ బయోలాజిక్స్ కూడా ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ ను విక్రయించనుంది. కృత్రిమంగా తయారు చేసిన చికెన్ ను గుడ్ మీట్ సంస్థ ఇప్పటికే సింగపూర్ లోనూ విక్రయిస్తోంది. ల్యాబ్ గ్రోన్ చికెన్ ను అనుమతించిన తొలి దేశం సింగపూర్.. తాజాగా ఇప్పుడు అమెరికాలో సైతం అందుబాటులోకి వ‌స్తుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement