అమరావతి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో వైసీపీ సెంటిమెంటును టీడీపీ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోందన్న వాదనలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. 2014లో అందరికంటే ముందుగానే డోన్ వైసీపీ అభ్యర్ధిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని వైసీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రెండేళ్ల ముందుగానే ప్రకటించి సంచలనం రేపారు. ఆయన అంచనాలు ఏమాత్రం తగ్గకుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేఈ ప్రతాప్‌పై ఘన విజయం సాధించారు. అంతేకాకుండా కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లి స్థానాలకుగానూ 11 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అధికారం కాస్తలో మిస్సయినా..కర్నూలు జిల్లాలో ఈస్థాయి ఫలితాలు వైసీపీకి మంచి ఉత్సాహాన్నే ఇచ్చాయని చెప్పాల్సి ఉంటుంది.
అలా తొలి అభ్యర్ధిని రెండేళ్ల ముందుగానే ప్రకటించడం వైసీపీకి సెంటిమెంటుగా మారింది. అదే తరహాలో 2019లోనూ ఇలాంటి సెంటిమెంటే మరోచోట సీఎం జగన్ అమలు చేశారు. సాధారణ ఎన్నికలకు చాలా రోజుల ముందే పత్తికొండ వైసీపీ అభ్యర్ధిగా కంగాటి శ్రీదేవి పేరు ప్రకటించారు. ఈమె కూడా కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబుపై అత్యంత మెజార్టీతో గెలుపొందారు. ఆమెతోపాటు జిల్లాలోని అన్ని అసెంబ్లిd, పార్లమెంటు స్థానాలను వైసీపీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. దీంతో రాజకీయ పార్టీలు కర్నూలు జిల్లాలో ముందస్తుగా అభ్యర్దుల ప్రకటన సెంటిమెంటుగా చెప్పుకుంటున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..