Wednesday, November 20, 2024

త్వరలో పర్యాటక ప్రాంతంగా కురవి : మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో మహా శివరాత్రి పురస్కరించుకొని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వీరభద్ర స్వామి ఆలయ అర్చకులు మంత్రిగారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కురవి జాతరలో బూర ఊది మంత్రి సత్యవతి రాథోడ్ సందడి చేశారు. జాతరలో చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ముక్కుకున్నట్లు తెలిపారు. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిలో ఆత్మశుద్ధిని, పరివర్తనను కలిగిస్తాయని మంత్రి అన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని కోరారు. మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. కురవి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు కోట్ల కేటాయించార‌న్నారు. 75 శాతం పనులు పూర్తయ్యాయి వచ్చే ఏడాది శివరాత్రి కల్లా పనులన్నీ పూర్తవుతాయ‌న్నారు. త్వరలో పర్యాటక ప్రాంతంగా కురవిని తీర్చిదిద్దుతామ‌న్నారు. ఈ ప్రాంతంలో హరిత హోటల్ ఏర్పాటుకు నివేదిక కూడా అందించడం జరిగింద‌న్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు కృషి చేస్తా అన్నారు. తెలంగాణ సుభిక్షంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. రాబోయే రోజులలో దేశంలోనే గొప్ప నాయకుడు కేసీఆర్ అవుతార‌న్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, కురవి జడ్పిటిసి బండి వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్ మరియు బీఆర్ఎస్ నాయకులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, వల్లూరి కృష్ణారెడ్డి, నెహ్రు నాయక్, జీవన్ నాయక్, బొడ శ్రీను నాయక్, భద్రు, నాగన్న, డాక్టర్ సుందర్ నాయక్, బొమ్మకంటి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement