Friday, November 22, 2024

ట‌ర్కీ భూకంపంపై మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి

ట‌ర్కీ , సిరియాలో సంభ‌వించిన మూడు శ‌క్తివంత‌మైన భూకంపాలు విల‌యం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. వరుసగా సంభవించిన మూడు శక్తివంతమైన భూప్రకంపనల కారణంగా అక్కడ వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ట‌ర్కీ, సిరియాలో చోటు చేసుకున్న భూకంప దృశ్యాలు త‌న‌ను తీవ్రంగా క‌లిచివేశాయ‌ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఘ‌ట‌న మాన‌వాళికి చాలా బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు. ట‌ర్కీ, సిరియా ప్ర‌జ‌ల‌కు ఆ భ‌గ‌వంతుడు మ‌రింత శ‌క్తినివ్వాల‌ని ప్రార్థించారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు కేటీఆర్.

ట‌ర్కీ భూకంపంలో మృతుల సంఖ్య 4,372కు చేరుకున్నట్లు తెలుస్తోంది. కేవ‌లం ట‌ర్కీలోనే 2921 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆ దేశ డిజాస్టర్ సంస్థ తెలిపింది. ఇక ఆ దేశంలో గాయ‌ప‌డ్డవారి సంఖ్య 15,834గా ఉన్నట్లు పేర్కొన్నది. సిరియాలో భూకంపం వ‌ల్ల సుమారు 1451 మంది మ‌ర‌ణించారు. మ‌రో 3531 మంది గాయ‌ప‌డ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement