Friday, November 22, 2024

KTR | కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ..

నీట్ యూజీ పరీక్ష వ్యవహారంలో కేంద్రం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంపై కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్ర‌మాదంలో ప‌డినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఒకవైపు గ్రేస్ మార్కుల గందరగోళం ఉంటే… మరోవైపు పేపర్ లీకేజీల సమస్యతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకూడదని కేటీఆర్ అన్నారు. ‘పరీక్ష పే చిర్చా’ నిర్వహించే ప్రధాని మోదీ, నీట్ వ్యవహారంపై కేంద్రమంత్రులు స్పందించాలని… మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని… బాధ్యులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement