Wednesday, January 15, 2025

Delhi | కేటీఆర్ కు సుప్రీంకోర్టులో నిరాశ..

ఢిల్లీ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.

ఫార్ములా-ఈ కారు రేసులో ఈనెల 8న ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement