రేవంత్ సర్కార్ పై కెటిఆర్ ట్విట్
దొరికినకాడికి దోచుకో…
అందినంత దండోకో.
చీకటి ఒప్పందాలతో సహజ వనరులను బుక్కెస్తున్నారు..
హైదరాబాద్ – ప్రస్తుతం రాష్ట్రంలో ‘దొరికినకాడికి దోచుకో… అందినంత దండుకో’ దందా నడుస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అక్రమార్కులు, కాంగ్రెస్ గ్యాంగ్‌లు చెట్టాపట్టాలేసుకొని సహజ వనరులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. చీకటి వాటాలు, సీక్రెట్ ఒప్పందాలు చేసుకొని యథేచ్ఛగా ఇసుక, మట్టిని బుక్కేస్తున్నారన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు.
ప్రజా పాలనలో దొంగలు..
దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇసుకాసుర.. బకాసుర.. భస్మాసుర రాజ్యం ఇది అని పేర్కొన్నారు. హైడ్రా దెబ్బకు హైదరాబాద్‌లో సొంతింటి కలలు కలగానే మిగిలిపోతున్నాయన్నారు. కాసులపై కక్కుర్తి నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నాయని ఆరోపించారు.
దీపావళి కూడా వచ్చింది…ధాన్యం కోనుగోళ్లు ఎక్కడా.
దసరాకే కాదు..దీపావళికి కూడా రైతులను దివాళా తీయిస్తారా? అంటూ కెటిఆర్ మరో ట్విట్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా..ధాన్యం కొనాలని అధికారులకు ఆదేశాలు అందవాయే అంటూ పేర్కొన్నారు. ..ప్రభుత్వానికి రైతుల గోస పట్టదాయే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాలపై పెట్టిన దృష్టి ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టరు? రైతులంటే ఎందుకంత అలుసు? అంటూ నిలదీశారు. మీ గారడీ హామీలను రైతులు విశ్వసించి మోసపోతున్నందుకా? అర్ధించడం తప్ప అక్రోషించడం తెలియని అమాయకులైనందుకా?
రాజకీయాల్లో రాక్షసక్రీడలను మానేసి..రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించండి..దయచేసి రైతుల విషయంలో రాజకీయాలు చేయకండి అని ప్రభుత్వాన్ని కోరారు..