Tuesday, November 19, 2024

పెట్టుబ‌డుల కోసం యుకె ప‌య‌న‌మైన కెటిఆర్ …

హైద‌రాబాద్ : రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ యూకే ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు ఆక‌ర్షించే ల‌క్ష్యంతో కేటీఆర్ యూకే ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయా దేశాల పారిశ్రామిక‌వేత్త‌లు, వాణిజ్య సంఘాల‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబ‌డుల అనుకూల‌త‌ల గురించి కేటీఆర్ వివ‌రించ‌నున్నారు. ఈ నెల 13వ తేదీ వ‌ర‌కు కేటీఆర్ యూకేలో ప‌ర్య‌టించ‌నున్నారు. కాగా, గ‌తేడాది మే 18 నుంచి 22 వరకు కేటీఆర్ లండన్‌లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. లండన్‌లో భారత హైకమిషన్‌ సమావేశంతోపాటు ప్రవాస భారతీయులు, యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. పలు ప్రతిష్ఠాత్మక సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజా ప‌ర్య‌ట‌న‌లో కూడా పెట్టుబ‌డుల‌ను ఆకర్షించేందుకు కెటిఆర్ ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement