సిద్దిపేటలో ఇవాళ ఐటీ హబ్ ప్రారంభోత్సవం జరగనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు కలిసి సిద్దిపేట ఐటీ హబ్‌ను ఇవాళ ప్రారంభిస్తారు..
మొదటి అంతస్తులో కాఫీటేరియా, ప్రయోగశాల, సమావేశ గదులు, ఇంటర్వ్యూ గదులు ఉన్నాయి. పట్టణ శివారులో రాజీవ్ రహదారిపై సుమారు రూ.63కోట్లలతో 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇందుకోసం భవనాన్ని నిర్మించారు.ఐటీ టవర్ మొదటి అంతస్తులో కాఫీటేరియా, ప్రయోగశాల, సమావేశ గదులు, ఇంటర్వ్యూ గదులు ఉన్నాయి. రెండో అంతస్తులో క్యాబిన్లు, ఒపెన్ వర్క్ స్టేషన్లు, క్లోజ్డ్ వర్క్ స్టేషన్లు ఉన్నాయి. టాస్క్ శిక్షణ కేంద్రం ఇక్కడే ఉంది. మూడో అంతస్తులో టీఎస్ఐఐసీ కార్యాలయం, బోర్డు గదులు, వీహబ్, వర్క్ స్టేషన్లు ఉన్నాయి. నాలుగో అంతస్తులో సైతం వర్క్ స్టేషన్లు ఉన్నాయి. సిద్దిపేట ఐటీ టవర్‌లో కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమలకు ప్రభుత్వం.. రెండు సంవత్సరాల పాటు నిర్వహణ, అద్దె, విద్యుత్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లుల్లో మినహాయింపులు ఇస్తోంది