ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుదల ఏప్రిల్ ఫూల్ తరహా జోక్ అయితే బాగుండేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. వాణిజ్య సిలిండర్ ధర రూ.250కి పైగా పెరిగిందనే ఓ వార్తా కథనంపై ట్విటర్‌లో ఆయన చమత్కారంగా స్పందించారు. ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ కావాలని సీరియస్‌గా తాను భావిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో అచ్చే దిన్ దివస్’ను ఏప్రిల్ ఫూల్స్ డేగా పోలుస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కాగా, 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరపై ఏకంగా రూ. 250 పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా హైదరాబాద్‌లో ఈ సిలిండర్ ధర రూ. 2,460కి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇదే సిలిండర్ ధర రూ. 2,253కి ఎగబాకింది. గత రెండు నెలల్లో ఈ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 346 పెరిగింది.