Friday, November 22, 2024

తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతోంది: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయా రంగాల వార్షిక నివేదికను గురువారం నాడు ఆయన విడుదల చేశారు. పారదర్శకత కోసమే తాము నివేదిక విడుదల చేసినట్లు కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతోందన్నారు. 2019-20లో రాష్ట్ర్ర ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లు ఉండగా.. 2020-21లో రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు.

ఐటీ రంగంలో జాతీయ స్థాయితో పోలిస్తే తెలంగాణలో ఉద్యోగం చేసే వారి రేటు మెరుగ్గా ఉందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా ఏడేళ్ల తర్వాత ఆ సంఖ్య రెట్టింపు అయ్యిందన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగం 6.28 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తోందన్నారు. ఐటీ రంగంపై 20 లక్షల మందికి పైగా ఐటీ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement