న్యూఢిల్లీ: రాజకీయ వైకుంఠపాళిలో అధికారంలోకి రావడమే పరమపదసోపానంగా భావించే ప్రధాని మోడి ఇతర రాష్ట్రాలలో కమలం వికాసానికి చేయని అరాచకం లేదు, పాల్పడని దుర్మార్గం లేదు. ప్రజలు ఎన్నుకున్న బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు, ప్రతిపక్ష పార్టీలను వేధించేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటున్నది అనేది విపక్షాల ఆరోపణలు.. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. ‘ఈక్వాలిటీ బిఫోర్ లా..?’ అనే శీర్షికతో మోదీ ప్రభుత్వ అరాచకాలకు సంబంధించిన చిట్టాను ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో నారాయణ్ రాణే, పశ్చిమబెంగాల్లో సువేంధు అధికారి, అసోంలో హిమాంత బిశ్వశర్మ తదితర నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి మోదీ సర్కారు ఎలా దారికి తెచ్చుకున్నదో అందులో వివరించారు.
దానికి ‘హౌ ద మోదీ గవర్నమెంట్ మిస్ యూజెస్ ద ఏజెన్సీస్ టు టాపిల్ గౌట్స్, ఇండ్యూస్ డిఫెక్షన్స్ అండ్ హరాస్ అప్పొజిషన్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఆ ట్విట్ లో నారాయణ్ రాణే 300 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో ఇరుకుంటే ఆయన బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.. వెంటనే దానిపై విచారణ నిలిచిపోయింది.. నారద స్కామ్ లో చిక్కుకున్న పశ్చిమబెంగాల్ నేత సువేంధు అధికారి కమలంలో చేరిన వెంటనే ఆ కేసు ఎటో వెళ్లిపోయింది. లంచం కేసులో చిక్కుకున్న అసోం నేత హిమాంత భిశ్వశర్మ బెజెపి గూటికి చేరడంతో ఆ కేసు అటకెక్కింది. మహరాష్ట్ర శివసేన లీడర్, ఎంపి గౌలి అవినీతి కేసులో అయిదుసార్లు సమన్లు వచ్చిన సందర్భంలో ఆయన షిండే శిబిరంలో చేరిపోయారు.. ఆ కేసు గురించి ఆలోచించడమే మానివేశారు.. యశ్వంత్ జాదవ్ దంపతులు కషాయం కప్పుకోవడతో వారి కేసులు మాఫీ అయిపోయాయి.. అంటూ ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఆ ట్విట్ ను కెటిఆర్ రీ ట్విట్ చేస్తూ ఇది ప్రధాని నరేంద్ర మోడి అరాచకాలు చిట్టా అంటూ పేర్కొన్నారు.