Friday, November 22, 2024

ఇవేనా.. అచ్చే దిన్‌…! పెట్రో ధరల పెంపుపై ఏమంటారు.. ట్విట్టర్‌లో ప్రధాని మోడీపై కేటీఆర్‌ ప్రశ్నాస్త్రాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ పాలనపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా పలు ట్వీట్లతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిష్ఠాత్మక మిషన్‌ భగీరథ పథకంలో కేంద్రం భాగస్వామ్యం ఎంతుందో ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అసలు ఈ పథకంలో కేంద్రం పాత్ర సున్నా అని తెలిపారు. మిషన్‌ భగీరథ పథకంలో ప్రజలకు ఇంటింటికి తాగునీరు అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని కేటీఆర్‌ పేర్కొన్నారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా 2019 నుంచి రాష్ట్రంలో 38 లక్షలకుపైగా ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించినట్లు ప్రధాని మోడీ ఇటీవల పత్రికలకు ఇచ్చిన ప్రకటనపై మంత్రి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వట్‌ చేశారు.

పెట్రో ధరలపై యూపీఏను విమర్శించిన విషయం మర్చిపోయారా…

గుజరాత్‌ రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్‌ హాలీడే ప్రకటించడాన్ని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్న గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్‌ హాలీడే ఇవ్వడం దేనికి నిదర్శనం పేర్కొన్నారు. ఇది డబుల్‌ ఇంజనా ట్రబుల్‌ ఇంజనా అని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గత పది రోజులుగా పెరుగుతుండడంపైనా కేంద్రంపై కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. థాంక్యూ మోడీజీ ఫర్‌ అచ్చే దిన్‌’ అని ట్వీట్‌ చేశారు. 2012లో పెట్రో ధరలు పెరగడం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం విఫలమైందనడానికి నిదర్శనమంటూ అప్పట్లో మోడీ చేసిన ట్వీట్‌ను కేటీఆర్‌ ప్రస్తావించారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం వచ్చాక ధరలు పెంచలేదంటూ మోడీ చేసిన మరో ట్వీట్‌ను కూడా అక్కడ జత చేశారు. మోడీతో పాటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ యూపీఏ ప్రభుత్వంపై చేసిన విమర్శలను వారికే గుర్తు చేస్తూ కేటీఆర్‌ ట్వీట్లు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement