హనుమకొండ : పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి అన్యాయం చేసిన వాడు సైఫ్ అయినా, సంజయ్ అయినా.. ఎవడైనా సరే వదిలిపెట్టబోమని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు… స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ. ప్రీతి ఆత్మహత్య విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరంగల్ ఎంజీఎంలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి దురదృష్టావశాత్తూ కాలేజీలో జరిగిన గొడవల్లో మనస్తాపానికి గురై ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అన్నారు . ఆ అంశాన్ని కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డామని,మంత్రులు సత్యవతి రాథోడ్, దయాకర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారని గుర్తు చేశారు.. ఈ వేదిక నుంచి ప్రీతి కుటుంబానికి తమ పార్టీ, ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా సంతాపం ప్రకటిస్తున్నామన్నారు. కొంత మంది రాజకీయంగా చిల్లరమల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ తాము ప్రభుత్వం, పార్టీ పరంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు..
మెడికో ప్రీతి కుటుంబానికి అండగా ఉంటాం
— BRS News (@BRSParty_News) February 27, 2023
ప్రీతికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే వాన్ని వొదిలిపెట్టం
– మంత్రి @KTRBRS pic.twitter.com/Odio3UoohI
విపక్షాలకు కేసీఆర్‌ను విమర్శిచేందుకు విపక్షాలకు కారణం దొరకట్లేదని, . ఏ తప్పు దొరక్క కుటుంబ పాలన అని కేసీఆర్‌ను విమర్శిస్తున్నారన్నారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలో కేసీఆర్ భాగస్వామినే. రైతులందరికీ పెద్దన్నలాగా కేసీఆర్ అండగా ఉన్నారని వెల్లడించారు. కేసీఆర్ కిట్ పథకం అమలుతో సర్కార్ దవాఖానాలో ప్రసవాల కోసం క్యూ కడుతున్నారన్నారు. గురుకులాల్లో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అక్కడ ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ విద్యార్థులను తయారు చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఇక
50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఏం చేశారు అని కేటీఆర్ నిలదీశారు. 24 గంటల కరెంట్ రైతులకు ఇవ్వాలన్న సోయి మీకు వచ్చిందా? ఒక్కో ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతుబంధు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? రైతులకు బీమా కల్పించాలనే ఆలోచన ఎందుకు రాలేదు? కరెంట్, సాగు, తాగు నీరు ఇవ్వరు.. ఇప్పుడేమో ఎగతాళిగా మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.