Friday, November 22, 2024

అచ్చాదిన్​ ఆయేగా.. గ్యాస్ సిలిండర్‌ ధర పెంచి మహిళలకు కానుకగా ఇచ్చిన మోడీ.. ట్విటర్‌లో కేటీఆర్‌ విసుర్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్విటర్‌ వేదికగా మరోసారి కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచడంపై ఆయన మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ మహిళలకు సిలిండర్‌ ధర పెరుగుదలను కానుకగా ఇచ్చారని ఎద్దేవా చేశారు. దీంతో దేశానికి మంచి రోజులు (అచ్చే దిన్‌) వచ్చినట్టేనని ట్విటర్‌ ద్వారా విరుచుకుపడ్డారు. దేశ ప్రజలంతా గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.50 పెంచిందని ఇందుకు నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మంచి రోజులు వచ్చేశాయ్‌.. అందరికీ శుభాకాంక్షలు.. గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచి కేంద్రం ఇప్పుడు వంటింట్లోనూ మంట పెట్టిందంటూ సెటైర్లు వేశారు. సిలిండర్‌ ధరల పెంపకాన్ని నరేంద్ర మోడీ జాతీయ మహిళలకు కానుకగా ఇచ్చేశారని పేర్కొన్నారు. గృహావసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిందర్‌ ధరను బుధవారం పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ ట్విట్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement