కొండపోచమ్మ సాగర్‌లో ప్రమాదవశాత్తు పడి… ఐదుగురు యువకులు మృతి చెందడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. యువకుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
యుక్త వయస్సులోనే చిన్నారులు చనిపోవడం వారి కుటుంబాలకు తీరని లోటు అన్నారు. తీవ్ర విషాదంలో ఉన్న ఆయా కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు.