Sunday, November 17, 2024

నిర‌స‌నకారుల‌పై చర్యలకు కేటీఆర్ ఆదేశం

దేశంలో పెరిగిన పెట్రోల్, గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌కు నిర‌స‌న‌గా ఇటీవ‌ల  కొంత‌మంది విపక్ష పార్టీకి చెందిన నాయకులు హుస్సేన్ సాగ‌ర్ లో గ్యాస్ సిలిండ‌ర్‌ను, బైక్‌ను సాగ‌ర్‌లో తోసేశారు. పెరిగిన ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. అయితే, ఈ ఘ‌ట‌న‌పై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించ‌డానికి.. ప్ర‌జాస్వామ్యంలో నిర‌స‌న ప్ర‌ధాన అంశ‌మే అయిన‌ప్ప‌టికీ.. బాధ్య‌తారాహిత్యంగా బైక్‌ల‌ను, సిలిండ‌ర్ల‌ను చెరువుల్లో తోసేయ‌డం స‌రికాద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

కాగా, కొద్ది రోజుల క్రితం.. పెరుగుతున్న నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ యూత్ కార్యకర్తలు హుస్సేన్ సాగర్లో బైక్ ని విసిరేశారు. వెంటనే ధరలను తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.  

ఇది కూడా చదవండి: ఎంపీ సుమలతపై నోరు జారిన మాజీ సీఎం

Advertisement

తాజా వార్తలు

Advertisement