Thursday, January 16, 2025

TG | ముగిసిన కేటీఆర్ ఈడీ విచార‌ణ‌…

  • ఎన్నిసార్లు విచారనకు పిలిచానా నేను సిద్ధం.
  • ఏడు గంటల పాటు అడిగిన ప్రశ్నలనే అడిగారు
  • ఏసీబీ, ఈడీ ప్రశ్నలు ఒకేలా ఉన్నాయి
  • లై డిటెక్టర్ పరీక్షకు సైతం సిద్ధం
  • రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

ఫార్ములా – ఈ కార్ రేసు వ్యవహారంలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు కేటీఆర్ ని ఈడీ కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. కాగా కేటీఆర్ ఈడీ ఆఫీస్ నుంచి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చారు..

ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేటిఆర్ మాట్లాడుతూ.. ‘‘రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్ సర్కార్ ఏసీబీ కేసు పెట్టిందని అన్నారు. ఎన్నిసార్లు విచారనకు పిలిచానా, నేను సిద్ధమేనని… విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఈడీకి చెప్పానని వివరించారు. ఏసీబీ కేసు పెట్టింది కాబ‌ట్టే ఈడీ కూడా విచారణ చేపట్టిందని వెల్లడించారు.

దాదాపు ఏడు గంటల పాటు అడిగిన ప్రశ్నలనే అడిగారని… ఏసీబీ, ఈడీ సంస్థల ప్రశ్నలు ఒకేలా ఉన్నాయని చెప్పారు. ఏసీబీ 80 ప్రశ్నలు, ఈడీ 40 ప్రశ్నలు అడిగారని తెలిపారు. రేవంత్ పై కేసులు ఉన్నాయి కాబట్టి.. మాపై కూడా కేసులు పెట్టి జైలుకు పంపాలనుకుంటున్నారని మండిప‌డ్డారు.

నేనూ, రేవంత్ రెడ్డి.. జడ్జి ముందు కూర్చుంటాం ఎన్ని ప్రశ్నలైనా అడగండి అని అన్నారు. దమ్ముంటే మీడియా ముందుకు రావాలన్నారు. ఇద్దరం కూర్చుందాం ఎవరు దొంగ ఎవరో తేలిపోతుంది అని అన్నారు. డేట్, ప్లేస్, టైం ఫిక్స్ చేయాలని రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు.

ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నార‌ని… తనపై పెట్టిన క‌ర్చుతో పథకాలనైనా సమర్థవంతంగా అమలు చేయవచ్చని అన్నారు. లై డిటెక్టర్ పరీక్షకు సైతం సిద్ధమని కేటీఆర్ అన్నారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా.. ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా అని తెలిపారు. నేనేం తప్పు చేయలేదని.. అరపైసా కూడా అవినీతి జరగలేదని తేల్చి చెప్పారు.’’

- Advertisement -

కాగా, ఉదయం 10:30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి చేరుకున్న కేటీఆర్ ని విచారణ బృందం సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఆర్బిఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు పై ఈడి మరో కేసుని నమోదు చేసింది. అయితే విచారణలో కేటీఆర్ ని ప్రధానంగా నగదు బదిలీ చుట్టూ ప్రశ్నలు సంధించారని, హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ కంపెనీకి నిధుల బదలాయింపు, నిధుల బదలాయింపులో ఫెమా నిబంధనల ఉల్లంఘన పై ఈడీ కేటీఆర్ ని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement