- వెతుకుతున్నా… బిజీగా ఉన్నా
- బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు సవాల్‌కు మంత్రి కేటీఆర్ క్రాస్ కౌంటర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : విద్య ఉద్యోగాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ ఎమ్మెల్సీ, ప్రస్తుత మహబూబ్‌నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియో జకవర్గ ఆ పార్టీ అభ్యర్థి రాంచందర్ రావు విసిరిన సవాలుకు మంత్రి కేటీ ఆర్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ గేటు బయట సోమవారం ఉదయం 11 గంటలకల్లా వస్తాను… మీరూ రండి చర్చిద్దాం అంటూ ఆదివారం రాంచందర్‌రావు ట్వీట్ చేశారు. దీనిపై సోమవారం ట్విట్టర్లో కేటీఆర్ స్పందించారు. ”గౌరవనీయులైన ప్రధాని మోడీ గారు ఇస్తానన్న 12 కోట్ల ఉద్యోగాలు (ఏడాదికి 2 కోట్లు) జన్‌ధన్ ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షల సమాచారం సేకరించడంలో నేను బిజీగా ఉన్నాను. కానీ ఇప్పటివరకు సమాధానం మాత్రం ఎన్డీఏ(ఎన్-నో, డీ-డేటా, ఏ-అవైలబుల్నే అని చురక అంటించారు. మీ దగ్గర ఏదైనా వాటికి సంబంధించి సమాచారం ఉన్నా పంపించండి” అని కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని వ్యంగ్యంగా కోరారు.