హైదరాబాద్ – కాంగెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై ప్రజాప్రాతినిధ్య చట్టం కింద అనర్హత వేటు వేయడాన్ని బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ తప్పుపట్టారు.. రాహుల్ ను ఎనిమిదేళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉంటే విధంగా లోక్ సభ కార్యదర్శి తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమన్నారు.. ప్రధాని మోడీ, అమిత్ షాల నియతృత్వం దొరణికి ఈ చర్య నిదర్శనమన్నారు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా వాళ్లపై ఇప్పటి వరకు ఈడీ,సిబిఐ, ఐటి దాడులు చేయించడం, వారిని వేధించడం బిజెపి ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు.. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ శిక్షపై 30 రోజులు స్టే ఉన్నప్పటికీ ఎంపి పదవిపై అనర్హత వేటు వేయడం కక్షసాధింపు చర్యేనని కెటిఆర్ వ్యాఖ్యానించారు.. రాహుల్ పై వేటు వేయడం రాజ్యాంగానికి వక్రభాష్యం చెప్పడమేనన్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement