Friday, November 22, 2024

న్యాయ‌వాదుల‌ను ర‌క్షించుకుంటాం – చ‌ట్టం తెస్తాంఃకెటిఆర్

వామన్‌రావు దంపతుల హత్య బాధాకరం
– దోషులను కఠినంగా శిక్షిస్తాం

బీజేపీది వాట్సాప్‌ యూనివర్శిటీ

అసత్యాలు ప్రచారం చేయడమే వారి పని

జీడీపీ పెంచుతామని గ్యాస్‌, డీజెల్‌, పెట్రోల్‌ ధరలు పెంచారు

కాంగ్రెస్‌కు చరిత్ర మిగిలింది… భవిష్యత్‌ లేదు

- Advertisement -

తెలంగాణ వచ్చాకే పీవీ శతజయంతి ఉత్సవాలు

భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం

వాణీదేవి ఎమ్మెల్సీ పదవికి అన్నివిధాల అర్హురాలు

గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌, : రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణకు అడ్వకేట్‌ ప్రొటెక్షన్‌ చట్టం తీసుకొచ్చే అంశాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ తానని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో జరిగిన సమా వేశంలో న్యాయవాదులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఇటీవల న్యాయవాద దంపతుల హత్య జరిగిన తీరు చాలా బాధాకరమన్నారు. న్యాయవాది చనిపోతూ మాట్లాడిన మాటలు అందరినీ కలిచివేశాయ న్నారు. ఆ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఆ ఘటనకు సంబంధమున్న టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యక్తిని వెంటనే సస్పెండ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. న్యాయవాదుల హత్య వెనుక టీఆర్‌ఎస్‌ పెద్దలున్నారన్న ఆరోపణలను కేటీఆర్‌ ఖండించారు. తెలం గాణ ఉద్యమంలో న్యాయవాదులు విద్యార్థులతో ధీటుగా పోరాడారని కొనియాడారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా హైకోర్టును విభజ నను ఆలస్యం చేసి బీజేపీ ప్రభుత్వం వారికి ఎంతో అన్యాయం చేసిందని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అడ్వకేట్‌ జనరల్‌గా తెలంగాణ వారిని నియమించమని అడిగితే అప్పటి పాలకులు ఎవరూ స్పం దించలేదని గుర్తు చేశారు. తెలం గాణ వచ్చిన తర్వాత ఇప్పటికి ముగ్గురు తెలంగాణ న్యాయవా దులు అడ్వకేట్‌ జనరల్‌ పదవిని చేపట్టారని పేర్కొన్నా రు. ప్రభుత్వ విభాగాల్లో జీపీలు, స్టాండింగ్‌ కౌన్సిల్‌లు గా ఎప్పటి నుంచో తిష్టవేసిన వారికి సంబంధించి త్వరలో తానే స్వయంగా చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని చెప్పారు. తన శాఖ జీహెచ్‌ఎంసీలోనూ అలాగే కొనసాగుతున్నారన్న విషయం ఇన్నిరోజు లుగా తనకు తెలియదన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టు పదవీ కాలం విషయంలోనూ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ వచ్చాకే మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు నిర్వహించామని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లిdలో తీర్మానించామని గుర్తు చేశారు. బీజేపీది వాట్సాప్‌ యూనివర్సిటీ అని, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు అసత్యాలు ప్రచారం చేస్తారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు తానే న్యాయవాదులకు రూ.100 కోట్ల నిధి పెట్టించానని చెప్పుకుంటున్నారని, తన కేంద్ర ప్రభుత్వంతో ఎన్ని నిధులు న్యాయవాదులకు ఇప్పించారో చెప్పాలన్నా రు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలన్నీ ఢిల్లి కి పోతే పిల్లులవుతున్నాయని విమర్శించారు. ఐటీఐఆర్‌ రద్దు చేయడమే కాకుండా మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయలకు నిధులు ఇవ్వనపుడు రాంచందర్‌రావు గొంతు ఎందుకు మూగబోయిందో చెప్పాలన్నారు. బీజేపీ జీడీపీ పెంచుతామని చెప్పి గ్యాస్‌, డీజెల్‌, పెట్రోల్‌ ధరలు పెంచుతున్నారని చమత్కరించారు. నల్లధనం తీసుకొచ్చి జన్‌ ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మాట తప్పారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి చరిత్ర తప్ప భవిష్యత్‌ అయితే కనిపించడం లేదని చురకంటించారు.
ఏడేళ్లలో తమ ప్రభుత్వం లక్షకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు, టీఎస్‌ఐపాస్‌ ద్వారా 14 లక్షల దాకా ప్రైవేటు ఉద్యోగాలు కల్పించిందన్నారు. న్యాయవాదు లకు కరోనా సమయంలో డబ్బులిచ్చి ఆదుకున్నామని చెప్పారు. దేశంలోనే రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, రైతుబీమా ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. గత గ్రాడ్యుయే ట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసిన ఓట్ల నమోదు చేయకపోవడం అనే తప్పు ఈసారి చేయడం లేదని, టీఆర్‌ఎ స్‌ పార్టీ క్రియాశీలంగా ఓట్ల నమోదు చేయించిందని తెలిపారు. న్యాయవాదులు బృందాలు గా ఏర్పడి గ్రాడ్యుయేట్‌ ఎన్నికలు జరుగుతున్న ఆరు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి టీఆర్‌ఎస్‌ తరపున ప్రచారం చేయాలని కోరారు.
మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవీ అన్ని విధాల పెద్దల సభకు అర్హురాలని, ప్రశ్నించడమే కాక పరిష్కరించే సత్తా ఉన్న నాయకురాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వాణీదేవికి వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌, హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గండ్ర మోహన్‌రావు, టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ అధ్యక్షులు కిరణ్‌ భారీ సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement