ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటించనున్నారు. హైదరాబాదు నుంచి హెలీక్యాప్టర్లో ఆయన భూపాలపల్లి జిల్లాకు చేరుకుంటారు. సమీకృత కలెక్టరేట్ ప్రారంభం, డబుల్ బెడ్రూంల ప్రారంభోత్సవం , సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణలో ఆయన పాల్గొంటారు. అనంతరం నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
ఆ తర్వాత ర్యాలీ గా బయలు దేరి సుభాష్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత జిల్లా కలెక్టరేట్లో మ్ముఖ్య అతిథులు, అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. కాగా మంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి, కలెక్టర్ భవేస్ మిశ్రా ఏర్పాట్లు పర్యవేక్షించారు.