ఈవీలను రూపొందించేందుకు అనేక ఆటోమొబైల్ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలోకి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కేటీఎం కూడా చేరింది. కేటీఎం కంపెనీ ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటలీ మిలాన్‌లో ఈ ఏడాదిలో జరగనున్న ఈఐసీఎంఏ షోలో దీనిని ప్రదర్శించనున్నట్టు సమాచారం. ఇక ఈ ప్రదర్శన తర్వాత కొన్ని నెలలకే కేటీఎం ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో అడుగుపెట్టే అవకాశం ఉంది.
ఇండియాలో ఈ స్కూటర్ ని బజాజ్ ఆటో మాన్యుఫాక్చర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇండియాలో తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్ లోకి ఎగుమతి చేసే యోచనలో సంస్థ ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్‌కు సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూద్దా..
ఇందులో ఫ్లాట్ సీట్, ఫ్లైస్క్రీన్‌తో పాటు వీల్స్ స్పోర్టీగా ఉంటాయని తెలుస్తోంది. ఫ్రెంట్ ఏప్రన్ చాలా అగ్రెసివ్‌గా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఫుట్‌బోర్డ్ ఫ్లాట్‌గా, సిల్వర్డ్ పిలియన్ గ్రాబ్ టెయిల్‌తో కూడిన సింగిల్ సీట్ ఉండొచ్చు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అల్యుమీనియం స్వింగ్ అర్మాతో పాటు అలాయ్ వీల్స్ వచ్చే అవకాశం ఉంది.
కేటీఎం ఈ-స్కూటర్ ఫ్రెంట్, రేర్ వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్ వస్తాయని తెలుస్తోంది. సింగిల్/ డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ సిస్టెమ్ కూడా ఉండనుంది. ధరకు సంబంధించిన వివరాలు.. లాంచ్ టైమ్‌లో అందుబాటులోకి వస్తాయి. ఈ-స్కూటర్ గురించి కేటీఎం లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారిని సంతృప్తి పరిచే విధంగా ఈ ప్రాడెక్ట్‌ను తీర్చిదిద్దాలని కేటీఎం భావిస్తోంది.